తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్‌కుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని ఆయన ఇంటితోపాటు మరో రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి, రూ.4కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.
- ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు
- రూ.4కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం
- అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
కరీంనగర్ రూరల్/కరీంనగర్ కలెక్టరేట్/ గజ్వేల్, మార్చి 7: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్‌కుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని ఆయన ఇంటితోపాటు మరో రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి, రూ.4కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రవణ్‌కుమార్ గతంలో కరీంనగర్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేసి బదిలీపై డిప్యూటీ తహసీల్దార్‌గా వెళ్లారు. ప్రమోషన్‌పై 2021 నుంచి ఆగస్టు 2023 వరకు కరీంనగర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేశారు.
ఎన్నికల సమయంలో బదిలీపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్‌గా వెళ్లి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం నగరంలోని మహారాజా బార్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఆయన ఇంటితోపాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు ఇండ్లు, ఆరు ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్, రూ.2,47,33,540 విలువ చేసే నాలుగు వాహనాలు, రూ.1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, రూ.30 లక్షల విలువైన ఫోర్ వీలర్, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.11.90 లక్షల నగదు ఏసీబీ తనిఖీల్లో పట్టుబడింది. శ్రవణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు లంచం అడిగితే 1064, 9440446106 నంబర్లకు, twitter @telangana ACB ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

