Mythri Movie Makers | టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రధాన పాత్రలో నటించిన ‘డిసి’ (DC) చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన సంచలన విజయంతో చిత్ర పరిశ్రమలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఈ
సినిమా సాధించిన సక్సెస్ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘AA23’ టీమ్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అధినేతలు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘డిసి’ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ప్రత్యేక ఫొటోలను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “డిసి చిత్రానికి అఖండ విజయం అందించినందుకు అభినందనలు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు #AA23 వంతు! అంటూ మైత్రీ రాసుకోచ్చింది. ప్రస్తుతం డీసీ సక్సెస్ మూడ్‌లో ఉన్న లోకీ త్వరలోనే ‘AA23’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు.