నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ( Adilabad District ) నార్నూర్, గాదిగూడ మండలంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ( Independence Day ) శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
వేడుకల సందర్భంగా ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జాడి రాజా లింగం, సత్యనారాయణ, ఎంపీడీవో లు పుల్లారావు, శ్రీనివాస్, ఎస్సైలు శ్రీ సాయి, రమ్య, సర్పంచ్ బానోత్ కావేరి, తోడసం రేణుక, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, ప్రజా ప్రతినిధులు, హాయ్ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.