Dementia | ఆరోగ్యవంతుడైన వ్యక్తికి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర కావాలని చెబుతారు. కానీ కొంతమంది నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోయినా చురుగ్గా మెలగడం మనకు కనిపిస్తుంది. అంత తక్కువ నిద్రతో ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారా? అనే అనుమానం వచ్చింది పరిశోధకులకు. దీనికి కారణం Familial Natural Short Sleep అని తేల్చారు పరిశోధకులు. తక్కువ నిద్రతో సరిపెట్టుకునే వంశపారంపర్య లక్షణం ఇది. తక్కువ సమయంలోనే నిద్ర తాలూకు ఎక్కువ ఫలితాన్ని పొందడం వీరి ప్రత్యేకత. ఇదే తరహా జన్యువులు ఉన్న ఎలుకల మీద ప్రయోగాలు చేసి మరీ నిరూపించిన విషయం ఇది. అంతేకాదు! నిద్ర సరిగా పట్టనివాళ్లు, డిమెన్షియా లాంటి సమస్యలున్నవారికి… తక్కువ సమయంలోనే గాఢ నిద్రను అందించే ఉపాయమూ ఈ పరిశోధనలో అంతర్లీనం.
“కంటినిండా నిద్రలేకుంటే ఈ అరోగ్య సమస్య తప్పదట!!”
“Sleep | కంటి నిండా నిద్ర ఉండట్లేదా? అయితే ఈ ముప్పు తప్పదు”
“నిద్రపోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు”
“Sleep | అమ్మో నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?”