చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడైన డిప్యూటీ సీఎం ఉదయనిధి పుట్టిన రోజు వేడుకలను డీఎంకే నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అశ్లీల డ్యాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో హాజరైన మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. (obscene dance at Udhayanidhi’s birthday ) నవంబర్ 27న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే నేతలు ఒక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి దుస్తులు ధరించిన కొందరు మహిళలు అశ్లీల డ్యాన్సులు చేశారు.
కాగా, మంత్రి ఎస్ పెరియకరుప్పన్ ఈ వేడుకలో పాల్గొన్నారు. స్టేజిపై అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న మహిళలను తన వద్దకు రమ్మని సైగ చేశారు. దీంతో ఆ మహిళలు స్టేజి నుంచి కిందకు దిగి ఆయన వద్దకు వచ్చారు. మంత్రి పెరియకరుప్పన్ దగ్గరగా వారు అశ్లీల డ్యాన్సులు చేయగా ఆయన చప్పట్లతో వారిని అభినందించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మంత్రి ఎస్ పెరియకరుప్పన్ తీరుతోపాటు అధికార డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. అన్నాడీఎంకే నేతలు కూడా ఆ మంత్రిని విమర్శించారు.
This is a minister in TN cabinet periyakaruppan getting girls to dance in this manner in front of him and all his party cadres to celebrate Udhayanidhi birthday. 👌 pic.twitter.com/aSODzpTrm3
— kishore k swamy 🇮🇳 (@sansbarrier) November 26, 2025
Also Read:
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Air India Plane | ఎయిర్ ఇండియా విమానంలో పొగ సంకేతం.. వెనక్కి మళ్లి ఎయిర్పోర్ట్లో ల్యాండ్