న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో పొగ ఉన్నట్లు అలెర్ట్ చూపించింది. దీంతో టేకాఫ్ అయిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించివేశారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. (Air India Plane) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 27న ఎయిర్ ఇండియా విమానం ఏఐ2939 ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. ఆ వెంటనే కార్గో విభాగంలో స్మోక్ ఉన్నట్లు కాక్‌పిట్‌లో అలెర్ట్ చూపించింది.
కాగా, విమానం పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ పాటించారు. ఆ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందు జాగ్రత్త కోసం ప్రయాణికులను విమానం నుంచి దించి వేశారు.
మరోవైపు పొగ అలెర్ట్ వచ్చిన కార్గో విభాగాన్ని విమాన సిబ్బంది పరిశీలించారు. అయితే అక్కడ ఎలాంటి పొగ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో తప్పుడు అలెర్ట్‌గా సిబ్బంది నిర్ధాయించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.
Also Read:
Mosquito-Repellent Detergents | దోమల నివారణకు.. స్మార్ట్ డిటర్జెంట్లు అభివృద్ధి చేసిన ఐఐటీ ఢిల్లీ
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?