న్యూఢిల్లీ: మలేరియా, డెంగ్యూ వంటి రోగాలకు కారణమైన దోమల నుంచి రక్షణ కోసం ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. దోమలను వికర్షించే డిటర్జెంట్లను అభివృద్ధి చేశారు. (Mosquito-Repellent Detergents) స్మార్ట్ బట్టల సర్పు లేదా లిక్విడ్‌తో ఉతికిన దుస్తులు దోమలను పారదోలుతాయి. తద్వారా ఆ దుస్తులు ధరించిన వారు దోమల కాటుకు గురికాబోరని ఐఐటీ ఢిల్లీకి చెందిన టెక్స్టైల్, ఫైబర్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జావేద్ నబిబక్ష షేక్ తెలిపారు. ‘హ్యాండ్-ఇన్-కేజ్’ పద్ధతి ద్వారా ఈ డిటర్జెంట్ పనితీరును పరీక్షించినట్లు ఆయన వివరించారు. ఈ డిటర్జెంట్‌లోని రసాయనాలు దోమల వాసన, రుచి సెన్సార్లపై పనిచేస్తాయని వెల్లడించారు.
కాగా, తాము అభివృద్ధి చేసిన దోమల వికర్షక డిటర్జెంట్లు పౌడర్, లిక్విడ్‌గా లభిస్తాయని ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు తెలిపారు. వాషింగ్ కేర్ లక్షణాలు కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ డిటర్జెంట్ పౌడర్, లేదా లిక్విడ్‌తో దుస్తులు ఉతికితే రానురాను దోమల వికర్షణ మరింతగా పెరుగుతుందని వివరించారు. తద్వారా దోమల వల్ల సంక్రమించే రోగాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. దీంతో ఈ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Also Read:
Sengottaiyan Joins TVK | విజయ్ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్
IMEI Tampering Unit Busted | అక్రమ మొబైల్ ఫోన్స్ తయారీ.. ఐఎంఈఐ ట్యాంపరింగ్ యూనిట్ గుట్టురట్టు
Watch: ప్లాస్టిక్ బొమ్మకు దహన సంస్కారాలకు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?