లక్నో: కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు బీజేపీ నేతలు వేదిక ఎక్కారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి ఆ వేదిక కూలిపోయింది. దీంతో ఆ జంటతో సహా బీజేపీ నేతలంతా కిందపడ్డారు. (Stage Collapsing) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానిక బీజేపీ నేత అభిషేక్ సింగ్ ఇంజినీర్ సోదరుడి పెళ్లి జరిగింది. నవంబర్ 26న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
కాగా, బల్లియా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మిశ్రా, మాజీ ఎంపీ భరత్ సింగ్ సహా సుమారు 12 మందికిపైగా బీజేపీ నేతలు హాజరయ్యారు. వారంతా వేదికపైకి ఎక్కి వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో కోసం సిద్ధమయ్యారు.
మరోవైపు ఉన్నట్టుండి ఆ వేదిక కూలిపోయింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటతో సహా బీజేపీ నేతలంతా కింద పడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. తేలికపాటి ఫ్లైవుడ్తో పెళ్లి వేదిక ఏర్పాటు చేయడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In UP’s Ballia, a wedding reception stage collapsed immediately after BJP district president and other senior leaders of the party got on to the stage to bless the newly wed. pic.twitter.com/4TzJywzofa
— Piyush Rai (@Benarasiyaa) November 27, 2025
Also Read:
Mosquito-Repellent Detergents | దోమల నివారణకు.. స్మార్ట్ డిటర్జెంట్లు అభివృద్ధి చేసిన ఐఐటీ ఢిల్లీ
Watch: ప్లాస్టిక్ బొమ్మకు దహన సంస్కారాలకు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?