హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28 : యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ అధ్యాపకులు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్లను కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాపార నిర్వహణ పద్ధతుల్లో సమకాలీన సమస్యలపై రెండు రోజులు జాతీయ సమావేశం ఉంటుదని సమావేశం డైరెక్టర్ ఫ్లైయింగ్ ఆఫీసర్ బి.ప్రసాద్ తెలిపారు. గౌరవ అతిథులుగా డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్లు కట్ల రాజేందర్, పి.అమరవేణి, పి.వరలక్ష్మి, ఎస్.నరసింహచారి, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రహేమాన్, కామర్స్ అధ్యాపకులు స్వామిశాడా, ఏ.సురేశ్, అజ్మీరా రమేశ్, కె.సోమశేఖర్, గిరిప్రసాద్, బక్కి శ్రీనివాస్, ఏ.సునీత, మయూరి శ్రీనివాస్తవ పాల్గొన్నారు.