లక్నో: చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం అందులో ఒక మేక ఉంచారు. అయితే ఆ మేకను చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఒక తాగుబోతు ఆ బోనులో చిక్కుకున్నాడు. (Man Trapped In Leopard Cage) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులోని ఉమ్రి గ్రామానికి చెందిన 55 ఏళ్ల శాంతి దేవిపై బుధవారం సాయంత్రం చిరుత దాడి చేసింది. ఆమె మరణించడంతో గ్రామస్తులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు.
కాగా, గురువారం రాత్రి ఆ గ్రామానికి చెందిన ప్రదీప్ ఒక బోను వద్దకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అందులో ఉన్న మేకను చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు బోనులోకి వెళ్లగా ఆటోమేటిక్ డోర్ లాక్ అయ్యింది. దీంతో ప్రదీప్ ఆ బోనులో చిక్కుకున్నాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సహాయం కోసం కేకలు వేశాడు. అలాగే మొబైల్ ఫోన్ ద్వారా తన బంధువులకు సమాచారం ఇచ్చాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన ఆ గ్రామ పెద్ద, గ్రామస్తులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఉంచిన బోనులో ప్రదీప్ ఉండటం చూసి షాక్ అయ్యారు. సుమారు రెండు గంటలు శ్రమించి అతడ్ని బయటకు తీశారు.
కాగా, బోనును పరిశీలించేందుకు వెళ్లిన తాను అందులో చిక్కుకున్నట్లు ప్రదీప్ తెలిపాడు. అతడి మాటలకు గ్రామస్తులు నవ్వుకున్నారు. అయితే ఆ వ్యక్తి బోనులో చిక్కుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी –
जिला बहराइच में तेंदुआ पकड़ने के लिए लगाए गए पिंजरे में एक इंसान (प्रदीप) फंस गया। माना जा रहा है कि वो पिंजरे में बंद बकरी चुराने आया था। जैसे ही पिंजरे के अंदर घुसा तो दरवाजा लॉक हो गया। pic.twitter.com/UixjNHhjjw— Sachin Gupta (@SachinGuptaUP) November 28, 2025
Also Read:
Watch: స్కై-డైనింగ్ రెస్టారెంట్లో చిక్కుకున్న టూరిస్టులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రాజస్థాన్లో గ్యాంగ్ వార్.. బైక్ను వాహనంతో ఢీ, కాల్పులు
Watch: ఉదయనిధి పుట్టినరోజు వేడుకలో అశ్లీల డ్యాన్సులు.. మంత్రి తీరుపై విమర్శలు
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?