జైపూర్: శతృత్వం ఉన్న రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను థార్ వాహనంతో ఢీకొట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు ఆ ముగ్గురిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. (Rajasthan Gang War) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్ వార్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లో కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 26న సాయంత్రం వేళ బన్సూర్ ప్రాంతంలో ఒక థార్ దూసుకువచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఉన్న బైక్‌ను ఢీకొట్టింది.
కాగా, బైక్ నుంచి కింద పడిన ఆ వ్యక్తులు పైకి లేచారు. తమ వద్ద ఉన్న గన్స్ తీసి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో థార్‌లోని వ్యక్తులు వెనక్కి తగ్గారు. ఇంతలో మారుతి స్విఫ్ట్ కారు ఆ ముగ్గురిపైకి దూసుకెళ్లగా వారు తప్పించుకున్నారు. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత థార్, స్విఫ్ట్ కారులోని వ్యక్తులు కిందకు దిగారు. రోడ్డు పక్కన పడి ఉన్న బైక్‌ను ఐరన్ రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం తమ వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు వాహనంతో బైక్‌ను ఢీకొట్టి కాల్పులు జరుపుకున్న గ్యాంగ్ వార్‌పై స్థానికులు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాల్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
కాగా, బైక్‌పై ఉన్న మహిపాల్ గుర్జార్, థార్‌లో ఉన్న వినోద్ పోస్వాల్ మధ్య పాత శత్రుత్వం ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన గ్యాంగ్ వార్‌కు కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు గ్యాంగ్‌లకు చెందిన వారి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్ వార్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A brazen gang war erupted in broad daylight in #Rajasthan’s newly formed Kotputli-Behror district, sparking fear and panic across the state’s northern belt.
What began as a confrontation between two criminal groups quickly escalated into a violent episode involving gunfire,… pic.twitter.com/7XEvx9Pfzj
— Hate Detector 🔍 (@HateDetectors) November 28, 2025
Also Read:
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఉదయనిధి పుట్టినరోజు వేడుకలో అశ్లీల డ్యాన్సులు.. మంత్రి తీరుపై విమర్శలు