అధికార పార్టీలో ఇసుక చిచ్చు..
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్‌ను నడిపిస్తుండగా వడ్వాట్ గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు అడ్డు చెప్పడంతో ఆదివారం దుప్పలి ఆశప్ప, బాలగారి శంకర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
- కాంగ్రెస్ నేతల బాహాబాహీ
- అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపుపై ఇరువర్గాల మధ్య వివాదం
- 24 మందిపై కేసు నమోదు
మాగనూర్, మే 31 : నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్‌ను నడిపిస్తుండగా వడ్వాట్ గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు అడ్డు చెప్పడంతో ఆదివారం దుప్పలి ఆశప్ప, బాలగారి శంకర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అడవిసత్యారం పెద్ద వాగు నుంచి ఆన్లైన్ పేరిట అడ్డూ అదుపు లేకుండా అధికార పార్టీ నేతలు నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు.
ఇదే క్రమంలో నేతల మధ్య ఇసుక రవాణాపై నెలకొన్న విబేధాలు తీవ్ర రూపం దాల్చి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు యత్నించినట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన నాయకులు ఇసుక వ్యవహారంలో పరస్పరం తలపడటంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు శాంతిభద్రతల సమస్యకు దారితీయడం ఆందోళన కలిగించే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇరు వర్గాలకు చెందిన 24మందిపై కేసు నమోదు
అడవిసత్యారం పెద్దవాగు ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తరలించే విషయంపై దుప్పలి ఆశప్ప, బాలగారి శంకర్ వర్గాలు పరస్పర దాడులకు పాల్పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఘటన అనంతరం ఇరువర్గా లు పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా రెండు వర్గాలకు చెందిన మొత్తం 24మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌బాబు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

