బాబోయ్ ఏదో అయిపోయింది..
94ఏండ్ల వయసులో ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన విభిన్న కథా చిత్రం ‘సింగ్ గీతం’. భారతదేశపు తొలి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా పతాకంపై నాగ్అశ్విన్ నిర్మించారు.
94ఏండ్ల వయసులో ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన విభిన్న కథా చిత్రం ‘సింగ్ గీతం’. భారతదేశపు తొలి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా పతాకంపై నాగ్అశ్విన్ నిర్మించారు. ఒక దిగ్గజ దర్శకుడు, ఒక లెజెండరీ నిర్మాణ సంస్థ కలిసి రూపొందించిన ఈ చిత్రం ద్వారా అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులుగా పరిచయం అవుతున్నారు. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ‘ఏమైంది.. ఏమైంది.. బాబోయ్ ఏదో అయిపోయింది..’ అంటూ సాగే పాటను స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఓ వింత పరిస్థితుల్లో చిక్కుకున్న గ్రామాన్ని పరిచయం చేస్తూ ఓ పజిల్‌గా ఈ పాట సాగింది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటగా మారిపోతాయి. ఎందుకలా జరిగిందో అర్థంకాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సొస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్‌గా మారిపోతూ వినోదాన్ని పంచుతాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను చిత్రంలో నటించిన నటీనటులే ఆలపించడం విశేషం. శ్రీమణి, దేవిశ్రీప్రసాద్, గౌతమ్ చల్లగుల్ల, రత్న శ్రీకర్, శశాంక్ చింతలపూడి కలిసి రాసిన ఈ పాట సినిమాలోని విచిత్ర పరిస్థితిని ప్రజెంట్ చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

