తిరువనంతపురం: చాలా ఎత్తులో గాలిలో వేలాడే స్కై-డైనింగ్ రెస్టారెంట్లో టూరిస్టులు చిక్కుకున్నారు. క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు పిల్లలు, మహిళతో కూడిన కుటుంబం కొన్ని గంటలపాటు స్కై-డైనింగ్ రెస్టారెంట్లో ఉండిపోయారు. (Tourists Stranded In Sky-Dining Restaurant) అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని రక్షించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అనాచల్ సమీపంలోని ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్లోకి ఒక కుటుంబం చేరుకున్నది. అయితే ఆ క్రేన్ పనిచేయకపోవడంతో 150 అడుగుల ఎత్తులో వారు చిక్కుకుపోయారు. పలు గంటలపాటు వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ఆ కుటుంబం భయాందోళన చెందింది.
కాగా, స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తాళ్ల సహాయంతో 150 అడుగుల ఎత్తులో ఉన్న ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్ పైకి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తొలుత ఇద్దరు పిల్లలను, ఆ తర్వాత వారి తల్లిని చివరకు తండ్రితో పాటు రెస్టారెంట్ మహిళా సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.
మరోవైపు ఆ కుటుంబం కోజికోడ్‌కు చెందినట్లు రెస్టారెంట్ మహిళా సిబ్బంది తెలిపింది. అయితే స్కై-డైనింగ్ రెస్టారెంట్లో టూరిస్టులు చిక్కుకోవడంపై నిర్వాహకులు తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరోపించారు. స్థానికుల ద్వారా తెలుసుకుని అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Munnar, Kerala | Tourists were stranded at a private sky dining setup in Anachal, Idukki, after a technical failure in the crane, today; Rescue operation underway
The incident occurred near Munnar, leaving tourists and staff stranded for over 1.5 hours. Rescue efforts… pic.twitter.com/Pciz0CoLxB
— ANI (@ANI) November 28, 2025
Also Read:
Watch: రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్.. బైక్‌ను వాహనంతో ఢీ, కాల్పులు
Watch: ఉదయనిధి పుట్టినరోజు వేడుకలో అశ్లీల డ్యాన్సులు.. మంత్రి తీరుపై విమర్శలు
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?