Sleep | సమయానికి నిద్రపోయే వారి జ్ఞాపకశక్తికి ఎలాంటి ఢోకా ఉండదనీ, ఎవరైనా పలకరించినప్పుడు కూడా ఠక్కున గుర్తుపట్టి పేరు పెట్టి మరీ పిలుస్తారని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. నిద్రకు మతిమరుపును పారదోలి, జ్ఞాపకశక్తిని పెంపొందించే శక్తి ఉందని ఇప్పటికే నిర్ధారించారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై మరింత పరిశోధన చేశారు. అందులో భాగంగా కొంతమందికి పలురకాల శబ్దాలు వినిపించి, నిద్రాభంగం కలిగించారు. మరికొందరికి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా చూశారు. గాఢంగా నిద్రపోయినవారు కొత్తవారి ముఖాలను, పేర్లను వెంటనే గుర్తించారు. మిగిలినవాళ్లు మాత్రం మనుషుల్ని గుర్తుపట్టడంలో కొంత ఇబ్బందిపడ్డారు. పేరు గుర్తుకు రాక, పలకరించడానికి తటపటాయించారు.