హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28 : అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపేది చదువే అని చాటిచెప్పి, విద్యా బోధన చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అన్నారు.
అమ్మ సావిత్రీబాయి పూలే సహితం మహిళల చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినట్లు కొనియాడారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్‌యాదవ్, సంకు నర్సింగరావు, బోయినపల్లి రంజిత్‌రావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్‌కుమార్, పున్నంచందర్, పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.