శనివారం 28 నవంబర్ 2020
Food - Nov 22, 2020 , 00:17:16

మునగాకు రైస్‌

మునగాకు రైస్‌

ఇమ్యూనిటీ ఫుడ్‌

కావాల్సిన పదార్థాలు: 

మునగాకు : అర కప్పు, బాస్మతి బియ్యం (ఉడికించినవి) : ఒక కప్పు, ఉల్లిపాయ : ఒకటి, అల్లం, వెల్లుల్లి ముద్ద : ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు (తరిగినవి) : మూడు, ధనియాల పొడి : ఒక టీ స్పూను, ఉప్పు : తగినంత, గరం మసాలా : ఒక టీ స్పూను, జీడిపప్పు : ఆరు, మసాలా దినుసులు (చెక్క, లవంగం, యాలకులు) : కొద్దిగా, పుదీనా : కొద్దిగా, కొత్తిమీర : కొద్దిగా, కరివేపాకు : కొద్దిగా, ఉప్పు : తగినంత.

తయారీ: 

ముందుగా కడాయిలో నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక నిమిషం వేగాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పుదీనా, మునగాకు వేసి వేయించాలి. ఆకు అంతా దగ్గరకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. నీరంతా ఇంకిన తర్వాత జీడిపప్పు, ముందుగా ఉడికించిన రైస్‌, ఉప్పు కలిపి ఐదు నిమిషాల వరకు వేయించాలి. చివరగా గరం మసాలా కలిపి దించేయాలి. కొత్తిమీరతో అలంకరించుకుంటే మునగాకు రైస్‌ రెడీ.