ఇస్లామాబాద్ : ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో పాలస్తీనాకు సాయం చేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది. పాలస్తీనా ప్రజలకు వైద్య, వస్తు సామగ్రిని పంపేందుకు నిశ్చయించింది. ఇజ్రాయెల్ పోరు నిలిపేలా ఒక వ్యూహం అమలుచేయడానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ టర్కీ వచ్చారు.
ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సహాయం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. కొవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పాలస్తీనియన్లకు పాకిస్తాన్ ప్రభుత్వం వైద్య సహాయం అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఇమ్రాన్ ప్రభుత్వంలోని మంత్రి ఫవాద్ చౌదరి ఈ ప్రకటన చేశారు. తాజా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 220 మంది మరణించారు. పాలస్తీనా సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తుండగా.. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతున్నది.
పాలస్తీనాపై దాడులను ఆపాలని ఇప్పటికే పాకిస్తాన్ ఇజ్రాయెల్‌ను కోరింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మంగళవారం టర్కీ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక వ్యూహాన్ని రూపొందించడానికి ఆయన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డో తోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రిని కలిసి చర్చిస్తారు. ఇక్కడ ఆయన మరికొన్ని ముస్లిం దేశౄల విదేశాంగ మంత్రులతో భేటీ కానున్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక వ్యూహాన్ని రూపొందించి.. అప్పుడు వారంతా ఒకే విమానంలో న్యూయార్క్ చేరుకుంటారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కొత్త తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేనున్నారు.
ఇలాఉండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ సంభాషణ జరిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. అయితే వీరి ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆ కథనంలో రాశారు.
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్‌లాక్ : కలకలలాడుతున్న ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్‌ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..