శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 16:01:23

బాలికపై ఐదుగురు లైంగిక దాడి.. సోషల్‌ మీడియాలో వీడియో..

బాలికపై ఐదుగురు లైంగిక దాడి.. సోషల్‌ మీడియాలో వీడియో..

సీతాపూర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. బాలికను అపహరించి ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని  సీతాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలివి.. ఇమాలియా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 7న శివారులోని మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది.

పక్క గ్రామానికి చెందిన షీబు, నజీమ్ అనే యువకులు బాలికను మార్గమధ్యలో అడ్డగించి సమీపంలోని చెరుకు తోటలోకి లాకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు యువకులతో కలిసి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇటీవల ఆ యువకులు వీడియోలను సోషల్‌  మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. కేసులో ప్రధాన నిందితుడైన షీబును పోలీసులు అరెస్టు చేసినట్లు సీతాపూర్ ఎస్పీ ఆర్పీ సింగ్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo