మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 06, 2020 , 08:04:27

యూఎస్‌లో దుండగుడి కాల్పల్లో ఇద్దరు మృతి

యూఎస్‌లో దుండగుడి కాల్పల్లో ఇద్దరు మృతి

గ్రీన్‌వెల్లీ : యూస్‌లో దక్షిణ కరోలినాలోని ఒక నైట్‌క్లబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఆ దుండగుడి కాల్పుల్లో మరో 8 మంది గాయపడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత 2గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియా ల్సి ఉందని అక్కడి పోలీసులు అధికారులు చెప్పారు.

శనివారం రాత్రి ట్రాప్‌ రాపర్‌ ఫూగియానో కార్యక్రమం ఉండడంతో క్లబ్‌లో జనం పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీసులు తెలిపారు. దింతో ఆ దుండగుడు ఒక్కసారిగా కాల్సలు జరుపగా ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo