జై సిద్ధార్థ్, శ్రీరాధా, నాజర్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామజన్మభూమి’. స్వీయ నిర్మాణ సంస్థ సముద్ర మూవీస్ పతాకంపై సముద్ర రూపొందిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను సీనియర్ నటుడు మురళీమోహన్ ఆవిష్కరించారు. ‘శ్రీరాముడు దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్లకు అన్నగా ధర్మబద్దంగా బ్రతికాడు. అలా ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని సంస్కరించాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని దర్శకనిర్మాత వి.సముద్ర తెలిపారు. నేటి సమాజానికి స్ఫూర్తినిచ్చే చిత్రమిదని హీరో జై సిద్ధార్థ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, నిర్మాత, దర్శకత్వం: వి.సముద్ర.