హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): ఏపీ మద్యం పాలసీ కేసులో నిందితులుగా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులకు చెందిన సుమారు రూ.441 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. లిక్కర్ పాలసీ ద్వారా నిందితులు ఏపీ ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3,500 కోట్ల నష్టం కలిగించారని, అలా అక్రమంగా ఆర్జించిన లాభాలను మనీ లాండరింగ్ ద్వారా వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారని ఈడీ తన దర్యాప్తు నివేదికలో పేరొన్నది. డిజిటల్ వ్యవస్థను రద్దు చేసి, మాన్యువల్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా డిస్టిలరీల నుంచి అదనపు మార్జిన్లు పొందారని, వాటిలో సిండికేట్‌కు 15-20% వరకు ముడుపులు చెల్లించారని వివరించింది.
బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్, ముప్పిడి అవినాశ్‌రెడ్డి అలియాస్ సుమిత్, మహ్మద్ సైఫ్ తదితరులు కీలక ఆపరేటర్లుగా పనిచేశారని తెలిపింది. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ సిండికేట్‌ను నడిపించాడని ఈడీ గుర్తించింది. బూనేటి చాణక్య, అవినాశ్‌రెడ్డి, ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, దిలీప్, సైఫ్ అహ్మద్ తదితరులతో కలిసి రాజశేఖర్‌రెడ్డి రూ.3,500 కోట్ల ముడుపులు వసూలు చేశారని నివేదికలో పేర్కొన్నది. ఆ ముడుపులను నగదు, బంగారం రూపంలో హైదరాబాద్‌లోని వివిధచోట్ల నిల్వచేసి, క్యాష్ హ్యాండ్లర్ల ద్వారా పంపిణీ చేశారని ఈడీ తేల్చింది.