హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో బొత్స ఇంటికి వెళ్లిపోయారు.