పొట్టులోనే పుట్టెడు
తాటి ముంజలపైన లేత పసుపు రంగులో ఉండే పల్చని పొట్టులో.. ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వేసవితోపాటే తాటి ముంజల సీజన్ కూడా వచ్చేస్తుంది. మండే ఎండల నుంచి.. ఈ ఐస్ ఆపిల్ ఎన్నోరకాలుగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే, చాలామంది తాటి ముంజల పైన ఉండే పొట్టును పక్కన పడేస్తుంటారు. కానీ, అందులోనే అసలైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
తాటి ముంజలపైన లేత పసుపు రంగులో ఉండే పల్చని పొట్టులో.. ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పొట్టులో అధిక శాతం లభించే పీచు పదార్థం.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో వచ్చే మలబద్ధకాన్నీ నివారిస్తుంది. ఇక తాటి ముంజలు శరీరానికి ఎంత చలువ చేస్తాయో.. పైన ఉండే పొట్టుకూడా అంతే స్థాయిలో శరీర వేడిని తగ్గిస్తుంది.
ఎండ వల్ల వచ్చే కడుపులో మంట, ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. వేసవిలో చెమటకాయలు, ఎర్రటి దద్దుర్లు లాంటివి పలకరిస్తాయి. ఈ చర్మ సమస్యలకు తాటి ముంజలపై ఉండే పొట్టుతో చెక్ పెట్టొచ్చు. ఈ పొట్టుతో నేరుగా చర్మంపై రుద్దడం వల్ల.. దురద, చెమటకాయలు తగ్గుతాయి. అయితే, ముంజలు లేతగా ఉన్నప్పుడే ఈ పొట్టు మృదువుగా, రుచిగా ఉంటుంది. ముంజలు ముదిరిపోతే.. పొట్టు కూడా వగరుగా మారుతుంది. జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి, లేత ముంజలపై ఉండే పొట్టును తినడమే మంచిది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

