కొత్తూరు, మే 10: ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా కొత్తూరు మున్సిపాలిటీ, మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తూరు మండలంలోని సిద్దాపూర్, ఎస్బీపల్లిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.
పెంజర్లలో మండల ఉపాధ్యక్షుడు దామెదర్‌రెడ్డి అధ్యర్యంలో, మల్లాపూర్ తండా మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో, గూడూరులో మాజీ సర్పంచ్ బ్యాగరి సత్తయ్య ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సమావేశంలో దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, నర్సింహారెడ్డి,
మాజీ సర్పంచ్ బాలయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రెడ్యానాయక్; అశోక్‌యాదవ్, మహేందర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షురాలు భగవద్గీత ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. పెంజర్లలో ఇంటింటికీ ప్రచారంలో నాయకులు దేశాల జైపాల్, మాజీ సర్పంచ్ వన్నం బాల్‌రాజ్, దేశాల భీమయ్య, వన్నం శేఖర్ పాల్గొన్నారు. మల్లాపూర్ తండాలో లభ్యానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, సోమ్లానాయక్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గోవింద్‌రెడ్డి, ఓంప్రకాశ్చారి, శ్రీను పాల్గొన్నారు.
నందిగామ : పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాంరెడ్డి, సురేశ్, జిల్లెల జనార్దన్‌రెడ్డి, విక్రంశర్మ, కొమ్ము వెంకటయ్య, పెంటయ్యగౌడ్, కృష్ణయ్య, బాల్‌రెడ్డి, నర్సింహ, వెంకటయ్య, ఎర్రగారి స్వామి, సురేందర్, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి వివేష స్పందన లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, బక్కన్న యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ ఓటర్లను కోరారు. మున్సిపాలిటీలోని 16వ వార్డులో శుక్రవారం కో-ఆప్షన్ సభ్యుడు ఒగ్గు కిశోర్‌తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.