ఎర్రవల్లి చౌరస్తా, మే 10 : తన మద్ద తు బీఆర్ఎస్ పార్టీకేనని మా జీ ఎంపీ మంద జగన్నాథం ప్రకటించారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వా ల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరులో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలు కో టలు దాటుతున్నాయని ఎద్దేవా చేశా రు.
బీఆర్ఎస్లో ఉన్న తాను కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి ఆ పార్టీ లో చేరానని, ఆ తరువాత తనకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పూర్తి పట్టు ఉన్నదని, ఆయనకే ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.