సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 11:22:26

స‌హోద్యోగిపై కాల్పులు జ‌రిపిన పోలీసు

స‌హోద్యోగిపై కాల్పులు జ‌రిపిన పోలీసు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని సీమాపురి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. ఓ పోలీసు.. మ‌రో కానిస్టేబుల్ పై కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. అమోద్ భ‌ద్నా, ర‌వీంద‌ర్ న‌గ‌ర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకే గ‌దిలో ఉంటున్నారు. అమోద్ త‌న డ్యూటీ ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకుని భోజ‌నం చేస్తున్నాడు. రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో ర‌వీంద‌ర్ కూడా రూమ్ కు వ‌చ్చాడు.

గ‌దికి వ‌చ్చిన కాసేప‌టికే ర‌వీంద‌ర్.. అమోద్ తో గొడ‌వ ప‌డ్డాడు. క్ష‌ణికావేశంలో అమోద్ పై ర‌వీంద‌ర్ త‌న స‌ర్వీస్ పిస్తోల్ తో కాల్పులు జ‌రిపాడు. అమోద్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ల‌డంతో అత‌ను కుప్ప‌కూలిపోయాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అమోద్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు ర‌వీంద‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


logo