శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 22:16:56

“దోస్తులంద‌రికీ బై..” ప్రేమ విఫ‌ల‌మై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

“దోస్తులంద‌రికీ బై..” ప్రేమ విఫ‌ల‌మై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

కరీంనగర్ : ప‌్రేమ విఫ‌ల‌మై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణంలోని స‌ప్త‌గిరి కాల‌నీకి చెందిన సాయి అనే యువ‌కుడు ఒప్పో మొబైల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా విధులు నిర్వ‌హించేవాడు. సాయి ప్రేమ విఫ‌లం కావ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై మూడ్రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతూ సెల్ఫీ వీడియో తీశాడు. 

వీడియోలో “ఎవ్వ‌రైనా.. ప్రేమిస్తే స‌చ్చేదాక ఉండేటోళ్ల‌ని చూసుకోండి. మ‌న‌కు కావాల్సిన వాళ్లు దూర‌మైతే హ్య‌పీగా ఉండ‌లేం. దోస్తులంద‌రికీ బాయ్‌.. నేను పోతున్న” అని సాయి నిర్మానుష్య ప్ర‌దేశంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స్నేహితులు గుర్తించి ద‌వాఖానకు త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo