Uttam Kumar Reddy | ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదు: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు.
- గతం కంటే నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం
- తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటున్నాం
Uttam Kumar Reddy | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటే తాము ప్రస్తుతం నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో గురువారం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందని, కరెంటు పోతున్నదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఖండించారు.
తడిసిన ధాన్యా న్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హా మీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాక అర్హులైన వారికి రేషన్‌కార్డులు, ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీలేదని, ఆ పార్టీ తమకు మూడు స్థానాల్లోనే పోటీ ఇస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

