– ఆగస్టు 2 నాటికి దరఖాస్తులు సమర్పించాలి
– నల్లగొండ డీఈఓ పి.సుశీంద్ర రావు
రామగిరి, జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కోసం 5 రోజుల అంతర్జాతీయ ఎక్స్పోజర్ & ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (Phase-II) నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి పి.సుశీంద్ర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.
ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ద్వారా మొత్తం 7 మందిని (పురుషులు-3, మహిళలు-4) ఎంపిక చేస్తారు.
SGT/LP/PET/TGT (సమాన కేడర్) – 3
SA/LFL HM/PGT (సమాన కేడర్) – 2
GHM/Principal (సమాన కేడర్) – 2
01-08-2026 నాటికి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
కనీసం 10 సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తయి ఉండాలి.
పాఠశాలలో కనీసం 100 మంది విద్యార్థుల నమోదు ఉండాలి.
ఎలాంటి శాఖాపరమైన విచారణ లేదా క్రిమినల్ కేసులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండకూడదు.
విద్యార్థుల నమోదు పెంపు, వినూత్న బోధనా పద్ధతులు, ICT వినియోగం, గత 3 సంవత్సరాల ఫలితాలు, జాతీయ/రాష్ట్ర స్థాయి అవార్డులు, ఇంగ్లీషులో కమ్యూనికేషన్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. గత 3 సంవత్సరాల పనితీరు ఆధారంగా పత్రాల పరిశీలన, అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారి (MEO) ద్వారా ఆగస్టు 02, 2026 సాయంత్రం 5.00 గంటలలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. పూర్తి వివరాలకు ఎంఈఓని సంప్రదించగలరని తెలిపారు.