Brazil Football Team : సాకర్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఊహించినట్టుగానే బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు(Brazil Football Team) భారత పర్యటన ఖరారైంది. ఆ దేశ సీనియర్ టీమ్ మొట్టమొదటిసారి ఇండియాకు రానుంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కోల్‌కతావాసులను అలరించేందుకు సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది బ్రెజిల్ జట్టు. అక్టోబర్‌లో బ్లూ టైగర్స్‌తో ఈ మ్యాచ్ విషయాన్ని శుక్రవారం బ్రెజిలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (CBF) అధికారికంగా వెల్లడించింది.
ఫిఫా వరల్డ్‌కప్ జోష్ ముగిసినా.. భారత్‌లో మళ్లీ ఫుట్‌బాల్ సందడి మొదలవ్వనుంది. మేటి జట్లలో ఒకటైన బ్రెజిల్ అక్టోబర్‌లో ఇండియాకు వస్తోంది. భారత జట్టుతో మ్యాచ్ కోసం ఆ దేశ సీనియర్ జట్టు రావడం ఖరారైందని బ్రెజిలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య(CBF) వెల్లడించింది. ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే జనమున్న కోల్‌కతాలో అక్టోబర్ 3వ తేదీన బ్లూ టైగర్స్‌ను బ్రెజిల్ ఢీకొట్టనుంది. ‘ది గోట్ ఇండియా టూర్’ పర్యటనలో లియోనల్ మెస్సీ (Lionel Messi) బృందం అభిమానులతో మమేకమైన సాల్ట్ లేక్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
🚨 IT’S OFFICIAL, FOLKS!!!! 🇮🇳🇧🇷
India will host five-time World Champions Brazil in Kolkata on October 3rd
Historical match for Indian Football ⚽️ https://t.co/2xVXAgNiiK pic.twitter.com/o6OwgHFpMu
— The Khel India (@TheKhelIndia) July 30, 2026
‘బ్రెజిల్ జాతీయ జట్టు షెడ్యూల్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం మా తర్వాతి అడుగు భారత్‌లో. మా ఫుట్‌బాల్ చరిత్రలో అదొక మరపురాని అధ్యాయం కానుంది. అక్టోబర్ 3వ తేదీన భారత గడ్డపై బ్రెజిల్ టీమ్ మొట్టమొదటి మ్యాచ్ ఆడనుంది. ఇందుకు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదిక కానుంది.
ఏళ్ల తరబడి బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు భారీగా అభిమానులున్న కోల్‌కతాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం చాలా ప్రత్యేకం కానుంది. ఈ పర్యటన కోసం మేము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. మిమ్మల్ని కోల్‌కతాలో కలుస్తాం’ అని సీబీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. నెయ్మర్ సారథ్యంలోని బ్రెజిల్ ఫిఫా వరల్డ్‌కప్ 2026లో నాకౌట్ దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.