‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వ్యతిరేకిస్తున్నట్లు బీసీ-ఏ కులాల ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన...
– బీసీ-ఏ కులాల ఐక్యవేదిక
నల్లగొండ రూరల్, అక్టోబర్ 23 : ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వ్యతిరేకిస్తున్నట్లు బీసీ-ఏ కులాల ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రవీంద్రభారతిలో పండుగ సాయన్న జయంతి వేడుకల సందర్భంగా ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బీసీ-ఏ వర్గాలకు అమలవుతున్న 7 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌లకు అదనపు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే బీసీ-ఏకు వేరుగా ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు కొట్టివేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అమలు సాధ్యం కాని హామీలతో బీసీ కులాల మధ్య విభేదాలు సృష్టించవద్దని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కంది సూర్యనారాయణ, సింగం రాంమోహన్, లకడాపురం వెంకటేశ్వర్లు, నేలపట్ల సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, యలిజాల వెంకన్న, తడం సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

