Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
Neha Bora : ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాకిచ్చింది. రూ.10,000 విలువైన పీస్ బాండ్ సమర్పించాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Neha Bora : ఏఐఎస్ఏ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాకిచ్చింది. రూ.10,000 విలువైన పీస్ బాండ్ సమర్పించాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో నేహాబోరా పాల్గొన్నారు. అనుమతి లేకుండా ఆందోళన సందర్భంగా జాతీయ జెండాను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అనుమతి లేకుండా జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలపై గత వారం ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి నేహా బోరా విడుదలైంది. ఈ సందర్భంగా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరై, రూ.10,000 విలువైన పీస్ బాండ్‌పై సంతకం చేయాలని ఆదేశించారు. అయితే, తాను ఏ శాంతి ఒప్పందంపై సంతకం చేయాల్సిన అవసరం లేదని, తనకు నిరసన తెలిపే హక్కు ఉందని నేహా బోరా వ్యాఖ్యానించింది.
పీస్ బాండ్‌పై సంతకం చేయాలంటూ ఎస్ఈఎం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నేహా బోరా పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, కోర్టు ఆదేశాలకు సంబంధించిన తుది కాపీ వెలువడాల్సి ఉంది. కోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా నేహా బోరా ఉన్నత స్థాయి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

