జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
అధికారులు అతని నుంచి రూ.20 లక్షల విలువ చేసే 436 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొంత బంగారాన్ని వైర్లెస్ పోర్టబుల్ స్పీకర్లో, మరికొంత బంగారాన్ని ఫేస్ మసాజర్‌లో దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడని, అయితే తమ తనిఖీల్లో పట్టుబడటంతో అతడిని అరెస్ట్ చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Rajasthan: A passenger intercepted by Customs officers at Jaipur International Airport and 436 grams of gold, valued at Rs 20 Lakhs, was seized from his possession. The gold was concealed in the round magnet of a 'wireless portable speaker & karaoke' and head of a 'face massager' pic.twitter.com/xzv2K4j1k9
— ANI (@ANI) March 31, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
మాకు హిందూ ముస్లిం భేదం లేదు: అమిత్ షా