కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ | సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనికా వారి కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ షెల్ఫ్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దేశంలోని ప్రధాన ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) శుభవార్త చెప్పింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనికా వారి కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ (వినియోగానికి నిలువ ఉంచదగిన కాలం)ను ప్రస్తుతం ఉన్న ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు సీడీఎస్సీఓ అధిపతి, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. వారు ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్లకుండా, లేబుల్లు వేయకుండా సంస్థ చేతిలో ఉన్న వాక్సిన్లకు మాత్రమే షెల్ఫ్‌లైఫ్‌ను పెంచుకునే అనుమతి ఉంటుందని డీసీజీఐ స్పష్టంచేశారు.
సీరమ్ సంస్థ తాము ఉత్పత్తి చేసిన మల్టీడోస్ (5 ఎంఎల్, 10 డోసులు) లతో కూడిన లేబుల్ వేయని బాటిళ్లపై టీకా షెల్ఫ్ లైఫ్‌ను తొమ్మిది నెలలుగా ప్రచురించుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డీసీజీఐ తెలిపింది. అయితే, లేబుల్ వేయని స్టాక్‌కు సంబంధించిన వివరాలను బ్యాచ్‌ల వారీగా తన కార్యాలయానికి, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీకి సమర్పించాలని డీసీజీఐ వీజీ సోమానీ తన లేఖలో ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

