సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!

న్యూఢిల్లీ: పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు, టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీచార్జ్‌లు, ఇతర సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులు చెల్లించడం కోసం ఆటో డెబిట్ పద్ధతిని ఉపయోగిస్తున్నవారు నిశ్చింతంగా మరో ఆరు నెలలపాటు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆటో డెబిట్ పద్ధతిలో చెల్లింపులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నది.
ఏప్రిల్ 1 నుంచే రికరింగ్ ఆన్లైన్ చెల్లింపులకు (ఆటో డెబిట్‌కు) ఏఎఫ్ఏ నిబంధనలను అమలు చేస్తే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఆర్బీఐ తన నిర్ణయం మార్చుకున్నది. ఏప్రిల్ 1కి బదులుగా అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో వినియోగదారులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలో ఆటో డెబిట్ చెల్లించుకునే అవకాశం లభించింది.
డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే రికరింగ్ ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ అమలు చేయతలపెట్టిన కొత్త ఏఎఫ్ఏ నిబంధనల ప్రకారం.. రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్‌కు ఓటీపీ నిర్ధారణ తప్పనిసరి. దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి 5 రోజుల ముందే సంబంధిత బ్యాంక్ నుంచి వినియోగదారులకు అలర్ట్ పంపాలి. అప్పుడు ఓటీపీతో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ పూర్తవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
మాకు హిందూ ముస్లిం భేదం లేదు: అమిత్ షా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

