ఈమధ్య తమిళ స్టార్ హీరోల ఇళ్లకు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ మధ్య ఒకసారి రజినీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హుటాహుటిన పోలీసులు జాగిలాలు, బాంబు స్క్వాడ్ తీసుకొని రజినీకాంత్ ఇంటికి వస్తే అక్కడ ఏం లేదు. తీరా చూస్తే ఒక చిన్న పిల్లాడు చేసిన ఆకతాయి పని అది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. కానీ రెండోసారి కూడా వాళ్ళు మోసపోయారు.
ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరో అజిత్ ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా అలజడి రేగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తిరువాయునమియూరులోని అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు బాంబు స్క్వాడ్ తో పాటు జాగిలాలను కూడా తీసుకుని అజిత్ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అలాంటిదేమీ లేదు. బాంబు బెదిరింపు కేవలం ఆకతాయిలు చేసిన పని అని తేలింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇలా తప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరు అని గుర్తించే పనిలో పడ్డారు స్థానిక పోలీసులు. ప్రతిసారి ఇలా స్టార్ హీరోల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది తమిళనాడులో ఈ మధ్య ఫ్యాషనైపోయింది. దాంతో దీనికి చెక్ పెట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఇదిలా ఉంటే అజిత్ ప్రస్తుతం వినోథ్ దర్శకత్వంలో వాలిమై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడు అజిత్.
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..