ఉగాది సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ టీజర్ అభిమానులను ఆనందంలో ముంచేసింది. ఇన్ని రోజులుగా నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే బోయపాటి శ్రీను ఈ సినిమాలో చూపించాడు. ఈ టీజర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని వాళ్లు నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు అఖండ సినిమా టీజర్ దుమ్ము రేపుతోంది. యూ ట్యూబ్ లో సంచలనం రేపుతోంది ఉగాది కానుకగా విడుదలైన టీజర్.. అభిమానుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
ఇక ఈ టీజర్లో బాలయ్య గెటప్ కూడా అదిరిపోయింది. ”కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ఈసారి” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కేక పుట్టిస్తోంది. ఈ టీజర్ కు కేవలం నందమూరి అభిమానుల నుంచి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. తాజాగా అఖండ టీజర్ చూసిన తర్వాత ఫిదా అయిపోయారు లోకేష్. టీజర్లో మామయ్య లుక్ అదిరిపోయిందని.. బ్లాక్ బస్టర్ కాబోతోందంటూ ట్వీట్ చేశారు.
Absolutely thrilled at the roaring look of Bala Mavayya in a terrific and mesmerising teaser of Akhanda! This is all set to be a massive blockbuster.💥 #BoyapatiSrinu #Akhanda #BB3TitleRoarhttps://t.co/jjX916A9Dj
— Lokesh Nara (@naralokesh) April 13, 2021
ఇదిలా ఉంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మే 28న అఖండ ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఓటీటీలో వకీల్ సాబ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..