తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండో దశ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా ఆడియన్స్‌తో కలిసే ఉన్నాడు. సాధారణ అభిమానులతో కలిసి దిల్ రాజు థియేటర్లో పేపర్లు ఎగరేయడం కూడా చూశాం. ఇదంతా ఇలా ఉంటే తాజాగా దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు దిల్ రాజు.
కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరాడు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్ తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. తనకు వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు ఈ నిర్మాత. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. దాంతో చిత్ర యూనిట్ కంగారు పడుతున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ కోసం అందరూ కలిసి ఉండటంతో ఇంకా ఎంతమందికి పాజిటివ్ వస్తుంది అనేది తెలియడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
పవర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువరత్న
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..