అందాల తార సాయిపల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్టుల్లో ఒకటి విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా మేకర్స్ సాయిపల్లవి స్పెసల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. హాఫ్ శారీలో పల్లెటూరి యువతిగా చిరునవ్వులు చిందిస్తూ గడపకు బొట్లు పెడుతున్న స్టిల్ తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
ఉగాది పండుగ సందర్బంగా సాయిపల్లవి ఫాలోవర్లకు మంచి గిఫ్ట్ అందించారు మేకర్స్. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్‌చంద్ర, సాయిచంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్