తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు యువ నటుడు సందీప్ కిషన్ (Sundeepkishan). హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ యంగ్ యాక్టర్ ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు. అదీ ఓ అమ్మాయితో. ఆగండ ఆగండి..అమ్మాయి అంటే ఎవరో అనుకునేరు. సందీప్ కిషన్ సోదరి మోనికాతో బాంద్రాకు వెళ్లాడు.
ఇంతకీ సందీప్ కిషన్ అక్కడికెందుకెళ్లాడంటే. ఓ ఇంటి కోసం బాంద్రా (Bandra) వీధుల్లో తిరిగాడు. ఆ ఇల్లు సందీప్ కిషన్ కోసం కాదు సోదరి మోనికా కోసమట. మరి ఇంతకీ మోనికాకు నచ్చిన ఇల్లు దొరికిందా..? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అన్నాచెల్లెళ్లిద్దరూ బాంద్రాలో కనిపించినపుడు తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?