Pithapuram | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ను గెలుపును కాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు.
ఓజీ డైరెక్టర్ సుజిత్, నిర్మాత ఎస్కేఎన్, నటుడు బాలాజీ.. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వారి వెంట జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌కు మద్దతుగా వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిసిందే. జనసేన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో పిఠాపురం సందడిగా మారింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత ఏపీ ఎన్నికల్లో రెండో చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారని తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు న్యాచురల్ స్టార్ నాని మద్దతు తెలియజేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ కూడా చేశాడు. మరోవైపు నటుడు కాదంబడరి కిరణ్ కూడా పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్లవల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని జనం కోసం జనసైనికుడయ్యాడు. ప్రజల కోసం, రాష్ట్రభవిష్యత్ కోసం పవన్ కల్యాణ్ అనే శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతడి గొంతు మనం వినాలి. జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి.. అంటూ ఇప్పటికే చిరంజీవి సందేశాన్ని పంచుకోగా నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం..
పిఠాపురంలో నిర్మాత శ్రీ ఎస్. కె. ఎన్ ఎన్నికల ప్రచారం @SKNonline #PawanKalyanWinningPithapuram#VoteForGlass | #Pithapuram #PawanKalyan pic.twitter.com/o4zPN4XbEZ
— JanaSena Pithapuram (@pithapuramjsp) May 9, 2024
జనసేనాని @PawanKalyan గారి రాకకై ఎదురుచూస్తున్న పిఠాపురం నియోజకవర్గం, చిత్రాడ గ్రామ ప్రజలు.#PawanKalyanWinningPithapuram#VoteForGlass#Pithapuram pic.twitter.com/JpubyKJELW
— JanaSena Tanuku (@Jsp_Tanuku) May 10, 2024
Actor @manamsaitham #KadamBariKiran Garu supports #Janasena #PawanKalyan @JanaSenaParty #Pithapuram#PawanKalyanWinningPithapuram#VoteForGlass | pic.twitter.com/XvqUrWJwzF
— suryaprakash (@suryaprakash2) May 9, 2024
Actor @manamsaitham #KadamBariKiran Garu supports #Janasena #PawanKalyan @JanaSenaParty #Pithapuram#PawanKalyanWinningPithapuram#VoteForGlass | pic.twitter.com/XvqUrWJwzF
— suryaprakash (@suryaprakash2) May 9, 2024
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
— Hi Nani (@NameisNani) May 7, 2024
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024