హైదరాబాద్ : సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సింగరేణిని అవినీతి మయం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కింగ్ పిన్‌గా అవినీతి జరుగుతోందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో 334 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. సింగరేణిలో40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని మండిపడ్డారు. ఒక్కో కార్మికుడికి లాభాల్లో లక్షా 80 వేల కోట్లు తక్కువగా ఇస్తున్నారు.
సింగరేణి డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ సోకులకు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లెటర్ రాశారు. కార్మికులకు నికర లాభాల్లో 36 శాతం వాటా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతాన్ని ప్రైవేట్ వాళ్లకు అమ్ముకోవాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు డిప్యూటీ సీఎం భట్టి, అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి అంటే సిరుల గని.
సిరిసిల్లకు ఎన్ని నిధులిస్తారో చెప్పాలి
సింగరేణి సంస్థను ఎవరికైనా అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 5 వ తేదీన తెలంగాణ భవన్ లో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్మిక సంఘం నేతలతో కేటీఆర్ మీటింగ్ ఉంటుందన్నారు. సిరిసిల్లను కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. రేవంత్ రెడ్డికి మైక్ దొరికితే తిట్టడం తప్ప వేరే పని లేదన్నారు. సిరిసిల్లకు రేవంత్ రెడ్డి ఎన్ని నిధులు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సిరిసిల్లకు టూరిస్ట్ లాంటి వారు. నాయకులను ఓడగొట్టడం, గెలిపించడం ప్రజల చేతుల్లో ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చుట్టూ రేవంత్ రెడ్డి రాజకీయం తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వొద్దని సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. నాన్ బేసిన్ కుప్పంకు కృష్ణా నది నీళ్లను తరలించారు.గురువు కండ్లలో ఆనందం కోసం రేవంత్ రెడ్డి తెలంగాణను ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో 20 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ మొలకెత్తదన్నారు.