Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
Dhyan chand : క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ విడుదల తేదీలను ఈ నెలాఖరున నిర్మాతలు ప్రకటించనున్నారు. 9 ఏండ్లుగా విడుదలకు నోచుకోని ఈ బయోపిక్‌ను వేగంగా పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

క్రీడల్లో అత్యుత్తమ అవార్డు ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ పేరును ‘ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా కేంద్రం మార్పు చేయడంతో మరోసారి మేజర్ ధ్యాన్ చంద్ (Dhyan chand) పేరు వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ విడుదల తేదీలను ఈ నెలాఖరున నిర్మాతలు ప్రకటించనున్నారు. 9 ఏండ్లుగా విడుదలకు నోచుకోని ఈ బయోపిక్‌ను వేగంగా పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
ధ్యాన్ చంద్ బయోపిక్ హక్కులను 2012 లో తొలుత పూజా శెట్టి, అశోక్ థాకేరియా తీసుకున్నారు. వీరు అనంతరం కరణ్ జోహార్‌కు హక్కులు ఇచ్చారు. చివరకు దాని హక్కులు రెండు సంవత్సరాలుగా రోనీ స్క్రూవాలా, ప్రేమ్‌నాథ్ రాజగోపాలన్ వద్ద ఉన్నాయి. దీనితోపాటు మరో రెండు సినిమాలు ‘ఏ థర్స్డే’ ‘పాంథర్స్’ కూడా రూపొందుతున్నాయి. ఉడ్తా పంజాబ్, ఇష్కియా సినిమాలకు దర్శకుడిగా ఉన్న అభిషేక్ చౌబే ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ విడుదల తేదీలను ఆగస్టు చివరిలోగా ప్రకటించనున్నట్లుగా సమాచారం అందింది.
మేజర్ ధ్యాన్ చంద్ పాత్ర కోసం రేసులో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ ముందు వరుసలో ఉన్నారు. యాదృచ్ఛికంగా వీరిద్దరూ కూడా రాకేశ్ శర్మ బయోపిక్ కోసం బలమైన పోటీదారులుగా ఉన్నారు. నిజానికి ఈ బయోపిక్‌ను గత ఏడాదే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తున్నది. గొప్ప వ్యక్తి జీవితచరిత్రను పెద్ద నటులతో తీయాలని నిర్ణయించడం కూడా సినిమా నిర్మాణంలో ఆలస్యానికి కారణమవుతున్నదని సినిమా వర్గాలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్‌లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

