Quit India : చరిత్రలో ఈరోజు.. క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
Quit India : ‘భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లండి’ అంటూ బ్రిటిషర్లకు సూచిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమానికి సరిగ్గా నేటికి 79 ఏండ్లు నిండాయి.

‘భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లండి’ అంటూ బ్రిటిషర్లకు సూచిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన క్విట్ ఇండియా (Quit India) ఉద్యమానికి సరిగ్గా నేటికి 79 ఏండ్లు నిండాయి. ‘మాకు స్వాతంత్య్ర ప్రకటించి మీరు మీ దేశానికి వెళ్లిపోండి’ అంటూ భారతీయులు 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వేచ్ఛా వాయువుల కోసం చావో రేవో తేల్చుకుందామంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు సమర నినాదమైంది. ఈ నినాదమే యావత్ భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా కదం తొక్కించింది. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయుల్లో పెల్లుబుకిన స్వాతంత్ర కాంక్షను గుర్తించిన బ్రిటీష్ పాలకులు.. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పలేదు.
రెండో ప్రపంచ యుద్దం సమయంలో ఎలాంటి చర్చలు జరుపకుండానే బ్రిటీష్ పాలకులు భారతీయులను రంగంలోకి దించారు. ఇది కాంగ్రెస్ – బ్రిటీషర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ప్రతిష్ఠంభనను అంతం చేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అప్పటి పార్లమెంట్ సభ్యుడు సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను 1942 మార్చిలో భారత్‌కు పంపారు. క్రిప్స్ మిషన్‌లో వచ్చిన అనేక ప్రతిపాదనలను భారతీయులు తిరస్కరించారు. క్రిప్స్ మిషన్ ఫెయిల్యూర్‌తో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942 ఆగస్ట్ 8 న ముంబైలోని కొవాలియా ట్యాంక్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశంలో ‘డూ ఆర్ డై’ అనే నినాదాన్ని మహాత్మాగాంధీ ఇచ్చారు. ఇది భారతీయుల మనసుల్లో నాటుకుపోయి స్వాతంత్ర కాంక్షను రగిలించింది.
స్వాతంత్య్రం ఇవ్వాల్సిందేనంటూ భారతీయులు చూపిన తెగువకు బ్రిటీష్ పాలకులు తలొంచాల్సిన పరిస్థితులు ‘క్విట్ ఇండియా’ ఉద్యమం నుంచే బీజం వేసుకున్నాయి. ఈ ఉద్యమం దాదాపు మూడేండ్ల పాటు కొనసాగింది. చివరకు బ్రిటీష్ పాలకులు 1947 ఆగస్ట 14 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2008 : చైనా రాజధాని బీజింగ్‌లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1974 : వాటర్‌గేట్ కుంభకోణంలో తన పాత్ర కారణంగా అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్
1963 : గ్లాస్గో నుంచి లండన్ వెళ్తున్న రాయల్ మెయిల్ రైలును దోచుకున్న సాయుధ దొంగలు
1945 : యుద్ధ నేరస్థులపై విచారణ జరిపేందుకు లండన్ ఒప్పందంపై సంతకాలు చేసిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్
1908 : తొలిసారిగా ప్రజల సందర్శన నిమిత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రదర్శించిన రైట్ బ్రదర్స్
1876 : మైమియోగ్రాఫ్కు పెటెంట్ పొందిన థామస్ ఆల్వా ఎడిసన్
ఇవి కూడా చదవండి..
లండన్‌లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

