ఆదివారం 24 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 00:21:39

రౌడీ పొగరు

రౌడీ పొగరు

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పొగరున్న  ఓ యువకుడి జీవిత గమనంలో ఎదురైన అనూహ్య సంఘటనలు ఏమిటి? రౌడీ మనస్తత్వం ఉన్న వ్యక్తి మంచివాడిగా ఎలా మారాడన్నది ఆసక్తిని పంచుతుంది. భారీ పోటీ మధ్య ఈ చిత్రం తెలుగు హక్కులను మూడు కోట్ల ముప్పై లక్షలకు సొంతం చేసుకున్నాం. ఈ సినిమాలోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాటకు తెలుగులో  43 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ధృవ సర్జా, రష్మిక మందన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. త్వరలో తెలుగు టైటిల్‌ను నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, చందన్‌శెట్టి.


logo