Pat Cummins | సన్ రైజర్స్ హైదరాబాద్ (ఐపీఎల్ 2024) కెప్టెన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాట్ కమిన్స్ (Pat Cummins) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు ఓ వీడియోతో నెట్టింట సందడి చేస్తున్నాడు. ఇంతకీ పాట్ కమిన్స్ ఏం చేశాడనే కదా మీ డౌటు. ఈ స్టార్ క్రికెటర్ మహేశ్ బాబు, అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్స్ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు.
పాట్ కమిన్స్ పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను డైలాగ్ చెబుతూనే.. మరోవైపు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. అంటూ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. పాట్ కమిన్స్ నయా వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
మహేశ్ బాబు నయా యాడ్ షూట్లో భాగంగా రీసెంట్గా పాట్ కమిన్స్‌తోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు మహేశ్ బాబును కలిశారని తెలిసిందే.మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి మహేశ్ బాబుతో విడివిడిగా.. గ్రూప్‌గా దిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.ఒకే ఫ్రేమ్‌లో తమ అభిమాన హీరో, క్రికెటర్లను చూసిన మూవీ అండ్ స్పోర్ట్స్ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ట్రెండింగ్‌లో పాట్ కమిన్స్ డైలాగ్స్ ..
ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪
అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩
చూడండి#TATAIPL
Hyderabad v Bengaluru | రేపు 6 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024
SRH ప్లేయర్స్ సూపర్ స్టార్‌తో ఇలా..