MS Dhoni : రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు అవకాశం దక్కేనా? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే ఉంది. వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో అనుభవం ప్రపంచకప్‌లో భారత జట్టుకు చాలా అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సైతం ఇదే మాట అంటున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ఎందుకు ఆడొద్దు అని మహీ భాయ్ ప్రశ్నించాడు.
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌తో కెరీర్ ముగించాలనే ఆలోచనల్లో ఉన్న ఈ ద్వయం కల నెరవేరుతుందా? అనేది ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో.. ధోనీ తన హయాంలో ఆడిన విరాట్, రోహిత్‌కు మద్దతు పలికాడు. ఇటీవల ‘మహీ అన్ప్లగ్డ్’ (MAHI Unplugged)అనే కార్యక్రమంలో పాల్గొన్న మహీ.. వయసు అనేది ఒక అంశం మాత్రమే. ఫామ్, ఫిట్నెస్.. ఈ రెండే చాలా కీలకం. కాబట్టి ప్రస్తుతం ఫామ్‌తో, ఫిట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఎందుకు ఆడకూడదు? అని ప్రశ్నించాడు.
It’s 2026 and Dhoni is still defending his boys ♥️ pic.twitter.com/bZUOzCLNiU
— Beast (@Beast__07_) February 4, 2026
వయసు 30 దాటినంత మాత్రాన వారిద్దరూ వచ్చే ప్రపంచకప్ ఆడకూడదా? రో-కో భవితవ్యాన్ని నిర్ణయించాల్సింది మనం కాదు. వారే నిర్ణయం తీసుకోవాలి. ఫామ్‌తో, ఫిట్నెస్తో ఉండి జట్టును గెలిపిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం దేనికి? అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు ధోనీ. ఒకప్పుడు కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌లను ప్రోత్సహించిన అతడు.. ఇప్పుడు టీమిండియా ప్రయోజనాలరీత్యా వీరికి బాసటగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ 38 ఏళ్లుండగా.. కోహ్లీకి 37 ఏళ్లున్నాయి.
🚨WHEN THE GOAT SPEAKS EVERYONE LISTENS.
– “Thala: ‘Age is not the criteria. Performance & fitness are.’
– MS Dhoni believes Virat Kohli & Rohit Sharma should play 2027 ODI World Cup 🏆
– The same voice that backed them in 2011, 2015, 2019… is backing them again for 2027 pic.twitter.com/UlNVEDhw96
— Vaishanvi Cricket (@Vaishnvii05) February 5, 2026
నిరుడు ఆస్ట్రేలియా పర్యటనతో వన్డే పగ్గాలు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించడం.. యువకులను సానబెట్టాలనుకోవడం వంటివి కోహ్లీ, రోహిత్‌లకు సవాల్ విసురుతున్నాయి. ఆసీస్ సిరీస్ కోసం కఠోరంగా శ్రమించి సన్నబడిన రోహిత్.. సిడ్నీ వన్డేలో రోహిత్ శతకంతో గర్జిస్తే.. హాఫ్ సెంచరీతో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆపై స్వదేశంలో దక్షిణాఫ్రికాపై విరాట్ వరుసగా రెండు సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌పై హిట్‌మ్యాన్ విఫలమైనా.. కోహ్లీ చెలరేగి ఆడాడు. వచ్చే వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లలోనూ పరుగుల వరద పారిచేందుకు కాచుకొని ఉన్నారిద్దరూ.
అయితే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో విరాట్, హిట్‌మ్యాన్ అంటీముట్టనట్టే ఉంటున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం రో-కోకు వరల్డ్‌కప్ అవకాశం ఇస్తాడనే నమ్మకం లేదు. అయితే.. ఫామ్‌లో ఉండేందుకు దేశవాళీ క్రికెట్లోనూ ఆడుతున్న ఈ లెజెండ్స్‌కు వరల్డ్‌కప్ అవకాశమిచ్చి గౌరవంగా వీడ్కోలు పలకాలని విశ్లేషకులు చెబుతున్నారు.