e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?

ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?

ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గ‌తంలో మా ఎన్నిక‌లు జ‌రిగినా ఇంత హైప్ మాత్రం రాలేదు. ఇదివ‌ర‌కు జ‌రిగిన మా అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ఇద్ద‌రి మ‌ధ్యే నువ్వా నేనా అన్న‌ట్టుగా పోటీ ఉండేది. కానీ ఈ సారి జ‌రుగుతున్న ఎన్నిక‌లు మాత్రం కాస్త ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ‘మా’ ఎన్నిక‌ల్లో తొలిసారి చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత‌రాజ‌శేఖ‌ర్, హేమ‌. వీరంతా అంద‌రికీ సుప‌రిచితులే. వీరిలో జీవిత‌రాజ‌శేఖ‌ర్ మా కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. మ‌రోవైపు న‌టి హేమ ఇప్ప‌టికే ‘మా’లో ప‌లు ప‌దవుల్లో కొన‌సాగారు. ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణుకు మాత్రం తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు.

ఈ న‌లుగురిలో ఎవ‌రికి వారు త‌మ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ 27 మంది స‌భ్యుల ప్యానెల్ జాబితాను విడుద‌ల చేశారు. ఈ జాబితాలో జ‌య‌సుధ‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌, ఉత్తేజ్, బండ్ల గణేశ్‌, బ్ర‌హ్మాజీ, నాగినీడు, త‌నీష్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులున్నాయి. ఇప్ప‌టికే మెగాఫ్యామిలీ నుంచి నాగ‌బాబు వ‌చ్చి ఈ సారి ప్ర‌కాశ్ రాజ్ లాంటి మంచి మ‌న‌సు వ్య‌క్తికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సపోర్టు ఉన్న‌ట్టుగా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

- Advertisement -

జీవితారాజ‌శేఖ‌ర్ కు మ‌ద్ద‌తు దొరికేనా..?

ఇక మ‌రోవైపు ఇప్ప‌టికే మా కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ జీవితారాజ‌శేఖ‌ర్ మాత్రం ఈ సారి జ‌రుగబోయే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌కు మ‌ద్ద‌తిస్తామ‌ని చిరంజీవి చెప్పార‌ని అంటున్నారు. త‌న‌కు అప్‌క‌మింగ్‌ న‌టీన‌టుల సపోర్టు ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో న‌రేశ్ తో విబేధాల‌తో ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి రాజ‌శేఖ‌ర్‌ రాజీనామా చేయ‌డంతో ‘మా’లో అల‌జ‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో చిరంజీవి, మోహ‌న్ బాబు స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు క‌ల‌గ‌జేసుకుని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. మ‌రి గ‌తంలో నెల‌కొన్ని ప‌రిణామాల దృష్ట్యా ఈ సారి జీవితారాజ‌శేఖ‌ర్ కు ఎంత‌మంది మ‌ద్ద‌తుంటుంద‌నేది స‌స్పెన్స్ గా ఉంది.

ఇక మంచు విష్ణు అధ్య‌క్ష బ‌రిలో పోటీలో ఉన్న‌ట్టు చెప్ప‌డంతో ఈయ‌న వెనుక సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ ఉన్నాడ‌ని మొద‌టి నుంచి వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ‘మా’లో ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉండ‌టంతో మంచు విష్ణుకు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హకారాలు న‌రేశ్ అందిస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. విష్ణు సీనియ‌ర్ న‌టులు కృష్ణ‌, కృష్ణంరాజుల‌ను క‌లిసి మ‌ద్ద‌తు కోరిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ టాక్‌. మ‌రి విష్ణుకు ఎంత మంది సపోర్టుగా నిలుస్తార‌నేది చూడాలి.

మ‌రోవైపు కొంత‌కాలంగా ‘మా’లో ప‌లు ప‌ద‌వుల‌ను నిర్వ‌ర్తిస్తూ అసోసియేష‌న్ పై మంచి ప‌ట్టున్న న‌టి హేమ కూడా త‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. తొలుత ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌నుకున్న హేమ.. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన‌ స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల సూచ‌న‌తో అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో నిలుస్తున్న‌ట్టు చెప్పారు. సాధార‌ణంగా మొదటి నుంచి గ‌మనించిన‌ట్లైతే ‘మా’ ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి మ‌ద్ద‌తు ఇచ్చిన వారికే గెలుపు అవ‌కాశం ద‌క్కింది. మ‌రి ఈ సారి మెగాఫ్యామిలీ స‌పోర్టు ఉన్న ప్ర‌కాశ్ రాజ్ గెలుస్తారా..? లేదా జీవిత‌రాజ‌శేఖ‌ర్‌, విష్ణు, హేమ గెలుస్తారా..? అన్న‌ది చూడాలి.

ఇవి కూడా చదవండి..

మా అధ్య‌క్షుడిగా ఆయ‌న్ను ఒప్పుకోను.. క‌రాటే క‌ళ్యాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


మా ఎన్నిక‌లు..పుకార్లకు క‌ల్యాణ్‌రామ్ బ్రేక్‌

మా’ ఎన్నిక‌లు..ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

మందు తాగ‌డం మానేసిన స్టార్ హీరో

సెట్‌లో స‌న్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్‌..వీడియో

‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్ర‌శ్న‌..వీడియో వైర‌ల్‌

మ‌రో బిజినెస్ వైపు స‌మంత అడుగులు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?
ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?
ఆస‌క్తిక‌రంగా ‘మా’ ఎన్నిక‌లు..ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి..?

ట్రెండింగ్‌

Advertisement