టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev), తమన్నా (Tamannah) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుర్తుందా సీతాకాలం (Gurtunda Seetakalam). లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ షురూ చేసిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చాలా రోజుల తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ విడుదల చేశారు. 2022 ఫిబ్రవరిలో గుర్తుందా సీతాకాలం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన లవ్ మాక్‌టెయిల్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని నాగశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా..ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇటీవలే సీటీమార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు వెంకీ, వరుణ్ తేజ్ మూవీ ఎఫ్ 3లో నటిస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకుంది. హిందీలో భోలే చుడియాన్, ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రాలు చేస్తోంది. దటీజ్ మహాలక్ష్మి సినిమాలో నటిస్తుండగా..ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి డైలామాలో పడ్డది.
Winter & love stories couldn't have asked for a better combination #gurthundaseethakalam releasing in theatres near you on February 2022!@ActorSatyaDev @tamannaahspeaks@nagshekar @akash_megha @IAmKavyaShetty @kaalabhairava7 @nagshekarmov #VedaksharaMovies pic.twitter.com/QDj7Nlf3K1
— Satya Dev (@ActorSatyaDev) December 13, 2021
మరోవైపు సత్యదేవ్ హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రామ్‌సేతులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో గాడ్సే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్